News February 15, 2025
నాపై రాజకీయ ముద్రతో అవకాశాలు కోల్పోయా.. సింగర్ ఆవేదన

శ్రీకాకుళంలోని అరసవల్లి రథసప్తమి వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానంతో తానొక కళాకారిణిగా పాల్గొన్నట్లు సింగర్ మంగ్లీ తెలిపారు. ఎన్నికల సమయంలో YCP సంప్రదిస్తే ఒక ఆర్టిస్ట్‌గానే పాటలు పాడానని, BRS, బీజేపీ నేతలకూ పాడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తనపై రాజకీయ ముద్ర వేయడంతో చాలా అవకాశాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 17, 2026
రోజూ తలస్నానం చేయొచ్చా?

రోజూ తలస్నానం చేయడం జుట్టుకు హానికరమనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యం స్కాల్ప్(మాడు) రకం, వాడే షాంపూపైనే ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ తలస్నానం చేస్తే చుండ్రు తొలగి జుట్టు శుభ్రంగా ఉంటుంది. డ్రై స్కాల్ప్ లేదా కలర్డ్ హెయిర్ ఉన్నవారు తరచూ చేస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంది. సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలు వాడితే రోజూ స్నానం చేసినా ప్రాబ్లమ్ ఉండదు.
News April 17, 2026
APPLY NOW: NICలో 153 ఉద్యోగాలు

153 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), న్యూఢిల్లీ దరఖాస్తులను కోరుతోంది. వీటిలో సైంటిఫిక్-C-12, సైంటిస్ట్-D-141 పోస్టులున్నాయి. B.E/B.Tech/M.Sc/ME /M.Tech/M.Philతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. సైంటిస్ట్-Cకు 35, సైంటిస్ట్-Dకు 40 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30.4.26. మరిన్ని వివరాలకు recruitment.nic.in చూడండి.
News April 17, 2026
హైదరాబాద్‌లో మరో సైబర్ టవర్!

TG: హైదరాబాద్‌లో ఐటీ విప్లవానికి గుర్తుగా నిలిచిన సైబర్ టవర్స్ తరహాలో మరో అత్యాధునిక పరిపాలనా భవనం నిర్మితం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కోసం ఐకానిక్ బిల్డింగ్‌ను 8 అంతస్తుల్లో నిర్మించనున్నారు. దీనికి రూ.200 కోట్లతో ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలును సీఎం పరిశీలనకు పంపారు. కైత్లాపూర్‌లోని ఐదెకరాల భూమిని అధికారులు ఎంపిక చేశారు.


