News September 27, 2024

‘ఆమెను ప్రేమించాను.. కానీ ఆమె న‌న్ను బెదిరించింది’

image

బెంగ‌ళూరులో మ‌హిళ‌ను ముక్క‌లుగా న‌రికి హ‌త్య చేసిన కేసులో నిందితుడు రంజ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకొనే ముందు తన త‌ల్లితో నేరం గురించి చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌హాల‌క్ష్మిని ప్రేమించాన‌ని, అయితే ఆమె త‌న‌ను కిడ్నాప్ కేసులో ఇరికిస్తాన‌ని బెదిరించింద‌ని త‌ల్లికి చెప్పిన‌ట్టు ఒడిశా పోలీసులు చెబుతున్నారు. ఆమె కోసం ఎంత ఖ‌ర్చు చేసినా త‌న ప‌ట్ల స‌రిగా ప్ర‌వ‌ర్తించేది కాద‌ని అవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Similar News

News October 15, 2024

మద్యంలో జగన్ రూ.40వేల కోట్ల దోపిడీ: అచ్చెన్నాయుడు

image

AP: రాష్ట్రంలోని వ్యవస్థలను YS జగన్ నాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మద్యంలో రూ.40వేల కోట్లు దోచుకున్నారని, ఇసుకలోనూ ఇలాగే కొల్లగొట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో నూతన లిక్కర్ పాలసీ వల్ల దరఖాస్తుల ద్వారానే రూ.1,800కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రేపు ఇసుక రీచ్‌లు మొదలవుతాయని, పది రోజుల్లో సమస్య తీరుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News October 15, 2024

పార్టీ గుర్తు విషయంలో ఈసీదే అంతిమ నిర్ణయం: శరద్ పవార్

image

పార్టీ గుర్తుపై ఎన్నికల కమిషన్‌దే తుది నిర్ణయమని ఎన్సీపీ-పవార్ వర్గం చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఈ విషయంలో ఈసీ ఆదేశాలను తాము స్వీకరించాల్సిందేనని చెప్పారు. గత ఏడాది పార్టీ రెండుగా విడిపోవడంతో మెజారిటీ ఆధారంగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా శరద్ వర్గానికి ‘బాకా ఊదుతున్న వ్యక్తి’ గుర్తును కేటాయించింది.

News October 15, 2024

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై కసరత్తు

image

AP: బీసీ డిక్లరేషన్‌లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. SC, ST అట్రాసిటీ చట్టం మాదిరిగానే BCల కోసం దీన్ని అందుబాటులోకి రానుంది. 8 మంది మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, అనగాని, పార్థసారథి, సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సచివాలయంలో విధివిధానాల రూపకల్పనపై చర్చించారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.