News March 5, 2025

ఒక్కదాన్నే వెళ్లి అబార్షన్ చేయించుకున్నా: హీరోయిన్

image

‘సాక్రెడ్ గేమ్స్’తో గుర్తింపు పొందిన హీరోయిన్ కుబ్రా సైత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెల్లడించారు. గతంలో తాను అండమాన్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఫ్రెండ్‌తో కలవడం వల్ల గర్భం దాల్చినట్లు చెప్పారు. భయపడి ఒంటరిగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నట్లు తెలిపారు. కొన్నేళ్ల వరకు అది ఎవరికీ చెప్పలేదన్నారు. ఈ విషయాలన్ని తన బయోగ్రఫీ ‘ఓపెన్ బుక్’లో పొందుపర్చినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Similar News

News March 25, 2025

వివేకా హత్య కేసులో కీలక పరిణామం

image

AP: వివేకా హత్య కేసుపై SCలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది. ‘MP అవినాశ్ చెప్పినట్లే సునీత, నర్రెడ్డిపై CBI అధికారి రాంసింగ్ కేసు నమోదు చేశారు. సునీత, నర్రెడ్డి, రాంసింగ్‌పై వివేకా PA కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును IO రాజు విచారించలేదు. తనను అవినాశ్ బెదిరించారని రాజు అంగీకరించారు. రిటైర్డ్ ASP రాజేశ్వర‌రెడ్డి, ASIG రామకృష్ణారెడ్డి కేసు మొత్తాన్ని నడిపించారు’ అని పేర్కొన్నట్లు సమాచారం.

News March 25, 2025

ఆస్తి పన్ను వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ

image

AP: ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరు వరకు ప్రాపర్టీ ట్యాక్స్‌పై పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ చేసింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల కొన్నేళ్లుగా పేరుకుపోయిన రూ.కోట్ల బకాయిలు వసూలవుతాయని అధికారులు చెబుతున్నారు.

News March 25, 2025

ఒళ్లంతా జ్వరం పట్టినట్టు ఉంటోందా…

image

వారం రోజులుగా చాలామంది శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తల తిరగడం, శరీరం తూలడం, కాళ్లు చేతులు లాగడం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. ఒళ్లంతా జ్వరం పట్టినట్టే ఉంటోందని వాపోతున్నారు. వాతావరణం మారడం, ఎండలు పెరగడమే దీనికి కారణమని వైద్యనిపుణులు చెప్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అవసరమైతే డాక్టర్ వద్దకు వెళ్లాలని చెప్తున్నారు. మీకూ ఇలాగే ఉంటోందా?

error: Content is protected !!