News January 25, 2025
జగన్ వద్దన్నా రాజీనామా చేశా: VSR

AP: రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి గాని పార్టీకి గాని న్యాయం చేయలేనన్న ఆలోచనతోనే రాజీనామా చేశానని విజయసాయి స్పష్టం చేశారు. తన కంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతారనే యోచనతో ఎంపీ పదవిని వీడానన్నారు. ఈ విషయాన్ని జగన్కు చెబితే, ఈ నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన చెప్పారని వెల్లడించారు. అయినా తన ఇష్టప్రకారం రాజీనామా చేశానని వివరించారు.
Similar News
News December 12, 2025
‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలంటారు పెద్దలు. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
News December 12, 2025
ఇంట్లో ఏ రంగు శివలింగం ఉండాలి?

వేర్వేరు రంగుల శివలింగాలకు వేర్వేరు ప్రత్యేక శక్తులుంటాయని పండితులు చెబుతున్నారు. ‘నలుపు: రక్షణ, స్థిరత్వం, ధైర్యాన్ని, తెలుపు: శాంతి, ధ్యానానికి మద్దతు ఇస్తుంది. బంగారు/పసుపు: సంపద, వృత్తిలో పురోగతి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆకుపచ్చ: కొత్త ప్రారంభాలకు సాయపడుతుంది. స్ఫటిక లింగం అతి శుభప్రదం. ఇది సామరస్యం, దైవిక రక్షణను ఆకర్షిస్తుంది. కోరికలకు తగిన లింగాన్ని ప్రతిష్ఠించాలి’ అని సూచిస్తున్నారు.
News December 12, 2025
పంచాయతీ ఎన్నికల్లో 84.28% ఓటింగ్

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైంది. 53.57లక్షల ఓటర్లకు గానూ 45.15లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ 90శాతం మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి వరకు 3,300 సర్పంచ్, 24,906 వార్డు స్థానాల్లో కౌంటింగ్ పూర్తైంది.


