News January 25, 2025

జగన్ వద్దన్నా రాజీనామా చేశా: VSR

image

AP: రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి గాని పార్టీకి గాని న్యాయం చేయలేనన్న ఆలోచనతోనే రాజీనామా చేశానని విజయసాయి స్పష్టం చేశారు. తన కంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతారనే యోచనతో ఎంపీ పదవిని వీడానన్నారు. ఈ విషయాన్ని జగన్‌కు చెబితే, ఈ నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన చెప్పారని వెల్లడించారు. అయినా తన ఇష్టప్రకారం రాజీనామా చేశానని వివరించారు.

Similar News

News February 7, 2025

విద్యుత్ డిమాండ్.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికం

image

TG: రాష్ట్ర రోజువారీ విద్యుత్ డిమాండ్ విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా గురువారం(FEB 6) 15,752 మెగావాట్లుగా నమోదైనట్లు ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు. 2024 మార్చి 8న రోజువారీ డిమాండ్ అత్యధికంగా 15,623 మెగావాట్లు నమోదుకాగా ఈసారి ఫిబ్రవరిలోనే అది బ్రేకయ్యింది. ఎండల నేపథ్యంలో రబీ సాగు, ఇళ్లు, పరిశ్రమల్లో కరెంటు వినియోగం పెరగడమే దీనికి కారణం.

News February 7, 2025

TCS ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేలో భారీ కోత

image

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. 2024-25 Q3లో వారి వేరియబుల్ పేలో భారీ కోత పెట్టినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నప్పటికీ వరుసగా రెండో క్వార్టర్‌లోనూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే అలవెన్స్ ఇవ్వగా, Q2లో 20-40 శాతానికి పరిమితం చేసింది. తనకు 50K-55K రావాల్సి ఉండగా Q2లో సగం, Q3లో ఇంకా తగ్గిందని ఓ ఉద్యోగి చెప్పారు.

News February 7, 2025

‘తండేల్’ మూవీ పబ్లిక్ టాక్

image

చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా షోలు USలో మొదలయ్యాయి. తండేల్ రాజు, సత్య పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశ భక్తి అంశాలు, DSP మ్యూజిక్, పాటలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని, డైరెక్టర్ కాస్త ఫోకస్ చేస్తే బాగుండేదంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ

error: Content is protected !!