News December 20, 2024

అశ్విన్‌లో ఆవేదన, బాధ కనిపించాయి: కపిల్ దేవ్

image

భారత స్టార్ ఆటగాడు అశ్విన్‌ ఇలా ఆటను వదిలేయడం తనను షాక్‌కు గురిచేసిందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. కొన్ని రోజులు ఆగి సొంత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించాల్సిందన్నారు. అతనిలో ఆవేదన, బాధ కనిపించాయని.. తన వైపు కథేంటో వినాలని ఉందని చెప్పారు. బ్యాటర్లకు ఎక్కువగా ప్రశంసలు దక్కే ఆటలో అశ్విన్ సత్తా చాటి 100కు పైగా టెస్టులు ఆడారన్నారు. BCCI అతనికి ఘనమైన వీడ్కోలు పలకాలని కపిల్ దేవ్ అన్నారు.

Similar News

News January 18, 2025

వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు?

image

TG: ఫిబ్రవరి చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26 నుంచి పలు పథకాల అమలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎలక్షన్ కోడ్ లోపు పథకాల అమలు పూర్తి కాకపోతే అది ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే ఛాన్సుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచిస్తే ఏప్రిల్/మేలో ఎన్నికలు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

News January 18, 2025

గడ్డకట్టే చలి.. ఇండోర్‌లోనే ట్రంప్ ప్రమాణం

image

ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం ఇండోర్‌లో జరగనుంది. వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి ఉండటంతో క్యాపిటోల్ భవనంలో ప్రమాణం చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో అతిథులను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పారు. కాగా అర్కిటిక్ బ్లాస్ట్ వల్ల వాషింగ్టన్ డీసీలో 20న -12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

News January 18, 2025

టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?

image

భారత స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఇటీవల గాయం కారణంగా CTకి దూరమవుతున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మేనేజ్మెంట్ ఆయనకు విశ్రాంతి కల్పించింది. దీంతో ఇవాళ ప్రెస్ మీట్‌లో బుమ్రా ఆడే విషయమై రోహిత్ ఎలాంటి ప్రకటన చేస్తారని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.