News February 9, 2025
రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్కాస్ట్లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.
Similar News
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <
News September 18, 2025
HEALTH: ఇవి పాటిస్తే రోగాలు దూరం!

* ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం పుష్కలంగా నీరు తాగండి
* గుండె ఆరోగ్యం కోసం అధికంగా ఉప్పు తినకూడదు
* పొగ తాగకుండా ఉంటే మీ ఊపిరితిత్తులు సేఫ్
* రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేస్తుంది
* పొట్ట ఆరోగ్యం కోసం ఐస్క్రీమ్స్, చల్లని పదార్థాలు తినడం మానేయాలి
* మూత్రనాళం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు మంచివని వైద్యులు చెబుతున్నారు.