News February 9, 2025

రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

image

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్‌లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.

Similar News

News April 16, 2026

బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

image

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>

News April 16, 2026

ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

image

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)

News April 16, 2026

IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.