News January 27, 2025
విడాకుల తర్వాత బాధపడ్డా.. కానీ ధైర్యాన్ని కోల్పోలేదు: సమంత

విడాకులు తీసుకున్న మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని హీరోయిన్ సమంత చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు. అందులో నిజం లేదని చాలాసార్లు చెప్పాలనిపించింది. అయితే నాతో నేను చేసుకున్న సంభాషణే ఆపింది. డివోర్స్ తర్వాత బాధగా అనిపించినా నేను ఏడుస్తూ ధైర్యాన్ని కోల్పోలేదు. నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
News April 16, 2026
10-20% పెరగనున్న మందుల ధరలు?

క్యాన్సర్ సహా ఇతర అత్యవసర మెడిసిన్ ధరలను 10-20% పెంచేందుకు ఫార్మా కంపెనీలకు కేంద్రం అనుమతిచ్చే అవకాశముందని నేషనల్ మీడియా పేర్కొంది. యుద్ధం నేపథ్యంలో ముడిపదార్థాల రవాణాలో అంతరాయం, ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని కంపెనీలు కోరినట్లు తెలిపింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు తాత్కాలికంగా 3 నెలలు వరకు మాత్రమే ఉంటుందని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ధరలు తగ్గిస్తారని సమాచారం.
News April 16, 2026
రాబోయే 2 గంటల్లో వర్షం

TG: వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాల వల్ల ఉక్కపోత, వేడి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.


