News April 28, 2024
నేను తలచుకుంటే అందరూ జైలుకే: రేవంత్
TG: తాను తలచుకుంటే ఎవరూ బయట తిరగలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను పోలీస్ రాజ్యం నడపను. రేవంత్ అనే పదం కొందరికి లైఫ్ లైన్‌గా మారింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. అది ఎక్కడికెళ్లి ఆగుతుందో తెలియదు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెబుతాం. BJP నేతల మాటల్లోనే భయం కనిపిస్తోంది. నేను పాలనపై దృష్టి పెడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 7, 2024
IPLలో రూ.13 కోట్లు.. ఆ డబ్బుతో రింకూసింగ్ ఏం చేశారంటే?
టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ రూ.3.5 కోట్లతో ఇల్లు కొనుగోలు చేశారు. IPLలో KKR అతడిని రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న కొద్ది రోజులకే యూపీ అలీగఢ్‌లోని ఓజోన్ సిటీలో ఖరీదైన 500 చదరపు గజాల బంగ్లాను కొన్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. కాగా, రింకూ సింగ్ తండ్రి ఇదే ఓజోన్ సిటీలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు. సక్సెస్ అంటే ఇదే కదా మరి!
News November 7, 2024
ఛార్జింగ్‌లో పేలిన ఐఫోన్.. చైనా యువతి ఆరోపణ
తన ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా పేలిపోయిందని చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన యువతి ఆరోపించారు. ఆ సమయంలో తాను నిద్రపోతున్నానని, పేలుడు కారణంగా చేతికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గది అంతటా మంటలు వ్యాపించి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ఆమె ఆరోపణలపై యాపిల్ స్పందించింది. ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దర్యాప్తు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.
News November 7, 2024
తిరుగులేని మొండితనం అంటే ట్రంప్: అదానీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘మొండితనానికి, సంకల్పబలానికి, మొక్కవోని దీక్షకు, తెగువకు ప్రతిరూపం ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంపే. అమెరికా వ్యవస్థాపక విలువల్ని రక్షిస్తూ ఆ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం ఇచ్చిన శక్తి ఓ అద్భుతం. అమెరికా 47వ అధ్యక్షుడికి కంగ్రాట్యులేషన్స్’ అని పేర్కొన్నారు.