News June 19, 2024

నాకు న్యాయం జరగాల్సిందే.. ఎవర్నీ వదలను: జేసీ

image

AP: YCP ప్రభుత్వ హయాంలో తనకు చాలా అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ‘చిన్న కారణాలతో నా బస్సులు సీజ్ చేశారు. నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. జైలుకు పంపి అన్నం కూడా పెట్టనివ్వలేదు. ఎంతో ఏడ్చాం. నా బండ్లు పట్టుకున్న బ్రేక్ ఇన్స్‌పెక్టర్ల ఇళ్ల ముందు కూర్చుంటా. నా బండ్లన్నీ రిపేర్ చేసి ఇవ్వాలి. ఈ విషయం వదిలిపెట్టను.. అవసరమైతే TDPకి రాజీనామా చేస్తా’ అని అన్నారు.

Similar News

News September 14, 2024

ముగిసిన వైసీపీ నేతల విచారణ

image

AP: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల విచారణ ముగిసింది. జోగి రమేశ్, దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంను మంగళగిరి పోలీసులు విచారించారు. కాసేపటి క్రితం వారు పీఎస్‌ నుంచి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించారు.

News September 14, 2024

ఖైరతాబాద్ గణేశ్.. నిమజ్జనం ఎన్ని గంటలకంటే?

image

TG: ఈ నెల 17న హైదరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం జరగనుంది. దీని కోసం సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 30వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు HYD కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనాన్ని మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటలకు గణనాథుడికి పూజలు పూర్తి చేసి నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు చెప్పారు.

News September 14, 2024

తొలి టెస్టుకు టీమ్ ఇండియా వ్యూహమేంటో..!

image

బంగ్లాతో తొలి టెస్టులో భారత్ వ్యూహమేంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్‌ పిచ్‌లలో రెండు రకాలు కనిపిస్తున్నాయి. నల్లమట్టి పిచ్‌పై స్పిన్నర్లు, ఎర్రమట్టి పిచ్‌పై పేసర్లు సాధన చేశారు. ఈ రెండింటిపైనా బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలమే అయినప్పటికీ పేస్‌కు అనుకూలమైన ఎర్రమట్టి పిచ్‌ను మ్యాచ్‌ కోసం భారత్ రెడీ చేయించింది. దీంతో అసలు టీమ్ ఇండియా వ్యూహమేంటన్న చర్చ జరుగుతోంది.