News April 10, 2025
మాజీ ప్రేయసికి బుద్ధి చెప్పాలని..

ప్రేమలో ఉన్నప్పుడు ఆన్‌లైన్ షాపింగ్, గిఫ్ట్‌లు కావాలంటూ వేధించిన యువతికి కోల్‌కతాలో మాజీ ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఆమెకు 300 COD ఆర్డర్లు చేశాడు. విసిగిపోయిన యువతి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఇది మాజీ ప్రియుడి నిర్వాకమేనని తేల్చారు. తెలియని నంబర్ల నుంచి మెసేజులు పంపి వేధించినట్లు వెల్లడించారు. నిన్న యువకుడిని కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరైంది.
Similar News
News March 30, 2026
భద్రాచలం: గోదావరి పుష్కరాలపై సీఎం సమీక్ష

2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఘాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసి, 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, సమన్వయం కోసం ప్రత్యేక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News March 30, 2026
అమ్మ అయ్యాక ఆడపులినైపోయా: కియారా అద్వానీ

తల్లికావడంతో జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ చెప్పుకొచ్చారు. తాను ఆడపులిలా మారిపోయానని.. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు జీవితాన్ని చూసే కోణం భిన్నంగా ఉందన్నారు. ఒక్కోసారి ఏదీ ముఖ్యం కాదని అనిపిస్తుంటుందని.. మరికొన్నిసార్లు అన్నీ ముఖ్యమనే భావన కలుగుతుంటుందని అన్నారు. గత ఏడాది ‘గేమ్ ఛేంజర్’లో మెరిసిన కియారా త్వరలో ‘టాక్సిక్’తో వెండితెరపై అలరించనున్నారు.
News March 30, 2026
ఈ నేలలు వేరుశనగ, నువ్వుల సాగుకు అనుకూలం

వేరుశనగ: ఇసుకతో కూడిన గరప నేలలు శ్రేష్ఠం. చల్కా, ఎర్రగరప నేలలు కూడా అనుకూలం. ఎక్కువ బంక మట్టిగల నల్ల రేగడి నేలల్లో పంట వేయరాదు. నేల pH 6.5-7.0 ఉండి, 20-30 సెం.మీ లోతు వరకు దున్నడానికి వీలుగా ఉండాలి.
నువ్వులు: మురుగు నీరు నిలవని తేమ నిలిచే తేలికైన నేలలు అనుకూలం. నీరు నిలిచే ఆమ్ల, క్షార నేలలు పనికిరావు. ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు కూడా మంచి దిగుబడినిస్తాయి.


