News April 10, 2025

మాజీ ప్రేయసికి బుద్ధి చెప్పాలని..

image

ప్రేమలో ఉన్నప్పుడు ఆన్‌లైన్ షాపింగ్, గిఫ్ట్‌లు కావాలంటూ వేధించిన యువతికి కోల్‌కతాలో మాజీ ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఆమెకు 300 COD ఆర్డర్లు చేశాడు. విసిగిపోయిన యువతి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఇది మాజీ ప్రియుడి నిర్వాకమేనని తేల్చారు. తెలియని నంబర్ల నుంచి మెసేజులు పంపి వేధించినట్లు వెల్లడించారు. నిన్న యువకుడిని కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరైంది.

Similar News

News April 21, 2025

‘లగచర్ల’లో మేం చెబుతున్న విషయాన్నే NHRC బయటపెట్టింది: కేటీఆర్

image

TG: లగచర్ల ఘటనలో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఇంతకాలంగా మేం చెబుతున్నదీ అదే. లగచర్లలో రైతులు, మహిళల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. మానవ హక్కుల హననానికి పాల్పడ్డారు. ఆ విషయాన్నే నివేదిక ఖరారు చేసింది. సర్కారుపై పోరాడిన గిరిజనులందరికీ అభినందనలు’ అని తెలిపారు.

News April 21, 2025

తులం బంగారం @రూ.1,00,000

image

బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. భారత లైవ్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.లక్షను తాకినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే, హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.99,860గా ఉన్నట్లు తెలిపారు. రేపటి వరకు రూ.లక్ష దాటే అవకాశం ఉందని వెల్లడించారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్ బంగారం ధర $3404 దాటినట్లు వెల్లడించారు. దీనికి అమెరికా- చైనా టారిఫ్ యుద్ధమే కారణమంటున్నారు.

News April 21, 2025

పోప్ ఫ్రాన్సిస్ మృతిపై బాబు, జగన్ దిగ్భ్రాంతి

image

AP: పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల CM చంద్రబాబు, మాజీ CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పోప్ ఫ్రాన్సిస్ తన శాంతి సందేశాలతో కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నా’ అని CBN పోస్ట్ చేశారు. ‘పోప్ ఫ్రాన్సిస్ నిజమైన మానవతావాది, ప్రపంచ శాంతికి గొంతుక వంటి వారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.

error: Content is protected !!