News December 9, 2024
నాపై దాడి చేశారు.. ప్రాణహాని ఉంది: మంచు మనోజ్
TG: పహాడీ షరీఫ్ పీఎస్‌కు వచ్చిన హీరో మంచు మనోజ్ నిన్న జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. 10 మంది ఆగంతకులు తనపై దాడికి పాల్పడ్డారని, ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. విజయ్, కిరణ్ సీసీ ఫుటేజీ తీసుకెళ్లారని చెప్పినట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు మనోజ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని సీఐ వివరించారు. ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 17, 2025
మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు
HYD మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు దక్కింది. వీటిని న్యూయార్క్‌కు చెందిన వరల్డ్ మోనుమెంట్స్ ఫండ్ ‘వరల్డ్ మోనుమెంట్స్ వాచ్-2025’ జాబితాలో చేర్చింది. హైకోర్టు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కాలేజ్, ఉమెన్స్ యూనివర్సిటీ వీటిలో ఉన్నాయి. కాగా కళ కోల్పోయిన ఈ చారిత్రక భవనాలకు సీఎం రేవంత్ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో పునర్వైభవం రానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
News January 17, 2025
పోలవరం ఆలస్యానికి జగనే కారణం: మంత్రి నిమ్మల
AP: గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తన కేసులు, బెయిల్ కోసం జలాలపై హక్కులను ఆయన వదులుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని రైతులు క్షమించబోరని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కూడా జగనే కారణమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు రెండు ఫేజ్‌లలో 51.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ ద్రోహం చేశారని మండిపడ్డారు.
News January 17, 2025
రాత్రి భోజనం చేయకపోతే…
బరువు తగ్గుతామని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. నైట్ భోజనం చేయకపోతే మధ్యరాత్రి ఆకలివేసి నిద్రకు భంగం కలుగుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. మరుసటి రోజంతా నీరసంగా ఉంటుంది. బద్దకం, చికాకు పెరుగుతుంది. ఉదయం లేవగానే బాగా ఆకలేసి ఎక్కువ తింటారు. ఇది బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి తప్పకుండా భోజనం చేయాలి. అయితే రోస్టెడ్‌తో పాటు ఫాస్ట్‌ఫుడ్ వంటివి తినకూడదు.