News February 26, 2025
నా సినిమాలో నటించినందుకు ఛాన్సులివ్వట్లేదు: సందీప్

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థపై ఫైరయ్యారు. ‘కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు ఒక నటుడిని ఓ నిర్మాణ సంస్థ తిరస్కరించిందని తెలిసి ఆశ్చర్యపోయా. అతను ఒక చిన్న పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడిషన్ ఇచ్చినందుకు నా సినిమాలో పనిచేసినందుకు తీసుకోవట్లేదని చెప్పడం ఏంటి? వారికి ధైర్యం ఉంటే ఇదే మాట రణ్‌బీర్ కపూర్, త్రిప్తి దిమ్రీ, రష్మికతో చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.
Similar News
News March 27, 2025
ఈ ఏడాది చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి: సీఎం

AP: గత ప్రభుత్వం రాజకీయ కక్షతో పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘గత ప్రభుత్వం కాఫర్ డ్యాంలను సకాలంలో నిర్మించకపోవడంతో రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దీంతో మళ్లీ కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వచ్చింది. దాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తాం. 2026 ఫిబ్రవరి నాటికి ECRF గ్యాప్-1, 2027 జూన్ నాటికి ECRF గ్యాప్-2 పూర్తి చేస్తాం’ అని మీడియాతో చెప్పారు.
News March 27, 2025
సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

TG: రాష్ట్రంలో ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా అని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని KTR నిలదీశారు. సిరిసిల్ల లేదా కొడంగల్‌లో ఎక్కడైనా నిరూపిస్తారా అని ప్రశ్నించారు. నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని CM రేవంత్‌కు సవాల్ విసిరారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఒకరిని జైలుకు పంపే అధికారం CMకు ఉండదని, నేరాలు నిర్ధారించి జైలుకు పంపేది కోర్టులని స్పష్టం చేశారు.
News March 27, 2025
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్..?

జూన్‌లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత్ ఓడిపోవడంతో పాటు హిట్ మ్యాన్ విఫలమవడంతో టెస్ట్‌లకు కెప్టెన్‌గా తప్పిస్తారని ప్రచారం జరిగింది. కాగా ఈ సిరీస్‌కు రోహితే కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే హిట్ మ్యాన్ అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.