News January 10, 2025

నాపై విషప్రయోగం జరిగింది: జకోవిచ్

image

2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ సమయంలో తనపై విషప్రయోగం జరిగిందని టెన్నిస్ స్టార్ జకోవిచ్ సంచలన ఆరోపణలు చేశారు. మెల్‌బోర్న్‌ హోటల్‌లో తనకు ఆహారంలో విషం కలిపి పెట్టారని తెలిపారు. అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షల్లో తన శరీరంలో మెర్‌క్యురీ ఉన్నట్లు తేలిందని చెప్పారు. కాగా జకోవిచ్ కొవిడ్ టీకా తీసుకోకపోవడంతో AUS ఓపెన్‌లో ఆడనివ్వలేదు. ఆ సమయంలోనే విషప్రయోగం జరిగిందని తాజా ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

Similar News

News January 10, 2025

బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతోంది. రిలీజ్ ట్రైలర్‌ను ఇవాళ సా.5:53 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది మొదటి ట్రైలర్‌ను మించేలా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, తమన్ సంగీతం అందించారు. ఈనెల 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

News January 10, 2025

బస్సు టికెట్ రూ.6వేలు, ఫ్లైట్ టికెట్ రూ.15వేలు

image

సంక్రాంతి పండక్కి వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోచుకుంటున్నారు. ఇదే అదనుగా బస్సు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.4వేలు, విశాఖకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. అటు HYD నుంచి విశాఖ ఫ్లైట్ టికెట్ ధర రూ.15వేలుగా ఉంది. డబుల్, ట్రిపుల్ రేట్లను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 10, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్

image

టీమ్ ఇండియా పేసర్ వరుణ్ ఆరోన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 2011లో అరంగేట్రం చేసిన అతడు భారత్ తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడారు. మొత్తం 29 వికెట్లు తీశారు. 2010-11 రంజీ ట్రోఫీలో 152 km/h వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత వరుస గాయాలతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది.