News January 10, 2025
నాపై విషప్రయోగం జరిగింది: జకోవిచ్
2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ సమయంలో తనపై విషప్రయోగం జరిగిందని టెన్నిస్ స్టార్ జకోవిచ్ సంచలన ఆరోపణలు చేశారు. మెల్‌బోర్న్ హోటల్‌లో తనకు ఆహారంలో విషం కలిపి పెట్టారని తెలిపారు. అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షల్లో తన శరీరంలో మెర్‌క్యురీ ఉన్నట్లు తేలిందని చెప్పారు. కాగా జకోవిచ్ కొవిడ్ టీకా తీసుకోకపోవడంతో AUS ఓపెన్‌లో ఆడనివ్వలేదు. ఆ సమయంలోనే విషప్రయోగం జరిగిందని తాజా ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
Similar News
News January 25, 2025
‘తండేల్’ ట్రైలర్ ఎప్పుడంటే?
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ మూవీ ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ రాసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News January 25, 2025
ప్రజల సొమ్ముతో తండ్రీకొడుకులు ఎంజాయ్ చేశారు: వైసీపీ
AP: బిల్డప్పులు కొట్టడం తప్ప చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఏం లాభం లేదని వైసీపీ విమర్శించింది. ప్రజల సొమ్ముతో తండ్రీకొడుకులు దావోస్‌లో ఎంజాయ్ చేసి వచ్చారని దుయ్యబట్టింది. 40 ఏళ్ల అనుభవమని, ఉత్త చేతులతో వచ్చారని సెటైర్లు వేసింది. దావోస్ పర్యటన డిజాస్టర్ అయిందని, బాబు పాలనని నమ్మి ఒక్క కంపెనీ MOU చేసుకోలేదని మండిపడింది.
News January 25, 2025
అప్పట్లో.. మామూలు హడావిడి కాదు! కదా..?
జెండా పండుగలు 90s కిడ్స్‌కు స్పెషల్ మెమొరీ. ఆటలపోటీలు, క్లాస్ రూం డెకరేషన్, మూలన ఉండే షూ, సాక్స్ వెతికి ఉతికించడం, యూనిఫామ్ ఐరన్, ఎర్లీగా రెడీ, దేశభక్తి నినాదాలతో పరేడ్, జెండావందనం, ప్రసంగం. ఇప్పుడంటే మెడల్స్, ట్రోఫీలు కానీ అప్పట్లో సోప్ బాక్స్, గ్లాసు, గిన్నెలే ప్రైజులు. చివరికి ఇచ్చే బిస్కెట్లు/చాక్లెట్లు ఇంట్లో చూపిస్తే అంత ఫీజు కడితే ఇచ్చేదివేనా? అని మనోళ్ల తిట్లు.
మీ మెమొరీ కామెంట్ చేయండి.