News December 6, 2024

సీన్ బాగా రావడం కోసం నన్ను పస్తులుంచారు: అదితి

image

‘హీరామండీ’లో సన్నివేశాలు బాగా పండటం కోసం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తనను పస్తులుంచారని నటి అదితీ రావు హైదరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘కొన్ని సీన్లలో నేను రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటికోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. దీంతో భన్సాలీ నన్ను రోజంతా ఆకలితో ఉంచేవారు. ఆకలి, కోపంతో ఆ సీన్లు బాగా చేయగలిగాను’ అని పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన హీరామండీ మంచి విజయం సాధించింది.

Similar News

News November 20, 2025

కోచింగ్ సెంటర్‌లో ప్రేమ.. విడాకులు!

image

iBOMMA నిర్వాహకుడు రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమీర్‌పేట్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన ముస్లిం యువతిని రవి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వారికి ఓ పాప ఉంది. విదేశాల్లో ఉన్న తన అక్క, బావ రూ.కోట్లు సంపాదిస్తుంటే, నీకు డబ్బు సంపాదించడం చేతకావట్లేదని రవి భార్య, అత్త ఎగతాళి చేసేవారని దర్యాప్తులో తేలింది. 2021లో విడాకులు కాగా పాపను భార్య తీసుకెళ్లినట్లు తేలింది.

News November 20, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్న స్వామివారిని దర్శించుకున్న 67,121 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు
* ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ: నాంపల్లి కోర్టు
* లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు పైపైకి
* 100వ టెస్టులో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫీకర్ రహీమ్.. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్‌గా రికార్డు

News November 20, 2025

సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>సత్యజిత్<<>> రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌‌ 14 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్, ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://srfti.ac.in/