News December 6, 2024
సీన్ బాగా రావడం కోసం నన్ను పస్తులుంచారు: అదితి

‘హీరామండీ’లో సన్నివేశాలు బాగా పండటం కోసం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తనను పస్తులుంచారని నటి అదితీ రావు హైదరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘కొన్ని సీన్లలో నేను రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటికోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. దీంతో భన్సాలీ నన్ను రోజంతా ఆకలితో ఉంచేవారు. ఆకలి, కోపంతో ఆ సీన్లు బాగా చేయగలిగాను’ అని పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన హీరామండీ మంచి విజయం సాధించింది.
Similar News
News November 11, 2025
ఢిల్లీలో ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు!

ఢిల్లీ ప్రజలు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న ఓ యువకుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ నిద్రలోనే చనిపోయాడు. దీనిపై ఓ తెలుగు వైద్యురాలు స్పందిస్తూ.. ‘ఢిల్లీ నుంచి వచ్చిన పిల్లలు శ్వాస ఇబ్బందులు అని చెబుతున్నారు. మొదట్లో షాక్ అయ్యా. NOV-DECలో ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఢిల్లీ వెళ్లారా అని అడిగితే అవునంటున్నారు’ అని Xలో రాసుకొచ్చారు.
News November 11, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* విశాఖ, తిరుపతి, అమరావతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తాం. రాయలసీమలో ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ , డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు
* కర్నూలు(D) బ్రాహ్మణపల్లిలో రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌కు శంకుస్థాపన జరిగింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బేవరేజస్ ప్లాంట్: మంత్రి టీజీ భరత్
News November 11, 2025
ముకేశ్ అంబానీపై CBI విచారణకు పిటిషన్

$1.55B విలువైన ONGC గ్యాస్‌ను దొంగిలించారంటూ రిలయన్స్, ముకేశ్ అంబానీపై ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నమ్మకద్రోహం, అక్రమాలతో గ్యాస్‌ను థెఫ్ట్ చేశారని, CBIతో విచారణ చేయించాలని జితేంద్ర పి మారు అనే వ్యక్తి కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు CBI, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే భూమి బ్లాక్‌ల మధ్య గ్యాస్ కదలికలు సహజమని, దాన్ని వెలికితీసే అధికారం తమకు ఉందని RIL పేర్కొంటోంది.


