News November 26, 2024
నన్ను దారుణంగా ట్రోల్ చేశారు: నయనతార
గజిని సినిమా సమయంలో తాను దారుణమైన ట్రోలింగ్‌కు, అవహేళనకు గురయ్యానని నటి నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో తెలిపారు. ‘గజిని సినిమాకి అసలు నన్నెందుకు తీసుకున్నారంటూ కొంతమంది ప్రశ్నించారు. ఇంత లావుగా ఉండి ఎందుకు నటిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. నటనపై విమర్శిస్తే తీసుకుంటాను. కానీ బాడీ షేమింగ్ తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. నా జీవితంలో అదే అత్యంత బాధపడిన సందర్భం’ అని వెల్లడించారు.
Similar News
News December 10, 2024
అసెంబ్లీకి కేసీఆర్ ఎప్పుడు వస్తారు?
TG: ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని అధికార పక్షంతో పాటు రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. నిన్న తొలి రోజు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో ‘ఆయన ఇక ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతారా? తమ పార్టీ నేతలకు దిశానిర్దేశాలతోనే కాలం గడిపేస్తారా?’ అంటూ అధికార పక్షం విమర్శిస్తోంది. ఈనెల 16 నుంచి కొనసాగే సమావేశాలకైనా ఆయన వస్తారేమో చూడాలి.
News December 10, 2024
మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు
మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని మోహన్‌బాబు వాట్సాప్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై FIR నమోదైంది. తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్‌బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 10, 2024
ప్రపంచంలో అత్యధికులు చదివేది ఇంగ్లిషే
ప్రపంచంలో 135 దేశాలవారు ఇంగ్లిష్‌లోనే చదువుకుంటున్నట్లు ‘డ్యులింగో లాంగ్వేజ్ రిపోర్ట్ 2024’ వెల్లడించింది. రెండో స్థానంలో స్పానిష్, మూడో ప్లేస్‌లో ఫ్రెంచ్ ఉన్నట్లు తెలిపింది. స్పానిష్ 33 దేశాల్లో, ఫ్రెంచ్‌ను 16 దేశాల్లో అభ్యసిస్తున్నట్లు వివరించింది. ప్రపంచంలో అత్యధిక మంది అభ్యసిస్తున్న పదో భాషగా హిందీ నిలిచింది. ఇంగ్లిష్ సర్టిఫికేషన్ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.