News October 15, 2024
కొత్తది కొనిస్తా, స్కూటీ తిరిగివ్వండి.. దొంగకు విజ్ఞప్తి
పుణేకు చెందిన అభయ్ అనే యువకుడి స్కూటీ చోరీకి గురైంది. ఎంత వెతికినా దొరక్కపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఆ స్కూటీ క్యాన్సర్‌తో చనిపోయిన తన తల్లిదని అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘నా యాక్టివా దొంగిలించిన దొంగకు ఓ రిక్వెస్ట్. ఈ స్కూటీ మా అమ్మ చివరి జ్ఞాపకం. దయచేసి దాన్ని తిరిగి ఇవ్వండి. మీకు కొత్త వాహనం కొనిస్తా’ అని ప్లకార్డుతో ప్రదర్శన చేస్తున్నారు.
Similar News
News November 12, 2024
క్రికెట్‌లోకి షమీ రీ ఎంట్రీ.. ఎప్పుడంటే..
పేసర్ మహ్మద్ షమీ సుమారు ఏడాది గ్యాప్ తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. రేపు మధ్యప్రదేశ్, బెంగాల్ మధ్య జరిగే రంజీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆయన ఫిట్‌గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ ధ్రువీకరించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ODI వరల్డ్ కప్ ఫైనల్లో షమీ చివరిగా ఆడారు. రంజీల్లో బౌలింగ్ బాగుంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు ఏదో విధంగా ఆయన్ను టీమ్ ఇండియా ఆడించే అవకాశం ఉంది.
News November 12, 2024
అమెరికన్ M4 రైఫిల్స్.. అఫ్గాన్ టు భారత్ వయా పాక్
ఇటీవల J&Kలో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన ఆర్మీ అత్యాధునిక అమెరికన్ M4 కార్బైన్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇవి అఫ్గాన్ నుంచి పాక్ టెర్రరిస్టులకు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. US బలగాలు 2021లో అఫ్గాన్‌ను వీడుతూ $7bn విలువైన ఆయుధాలను వదిలేశాయి. వాటిలో వేలాదిగా M4 రైఫిల్స్ ఉన్నాయి. లైట్ వెయిట్‌తో ఉండే వీటి ద్వారా నిమిషానికి 700-900 రౌండ్స్ కాల్చవచ్చు. రేంజ్ 500M-3,600M వరకు ఉంటుంది.
News November 12, 2024
అమృత్ టెండర్లలో అవినీతి పెద్ద జోక్: కోమటిరెడ్డి
TG: కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందనేది పెద్ద జోక్ అని చెప్పారు. ‘CM రేవంత్‌కు సృజన్ రెడ్డి తోకచుట్టం. కవిత, సృజన్ రెడ్డిలు వ్యాపార భాగస్వాములు. పాలమూరు టన్నెల్ పనులను వారిద్దరే చేశారు. దీనికి KTR సమాధానమివ్వాలి. అధికారులపై దాడులు, అమృత్ టెండర్లలో అవినీతి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.