News December 27, 2024
నా పిల్లలకు మన్మోహన్ స్కాలర్‌షిప్ ఇస్తానన్నారు: మలేషియా ప్రధాని
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నెమరేసుకున్నారు. ‘గతంలో నేను జైలుకు వెళ్లినప్పుడు సింగ్ అండగా నిలిచారు. మలేషియా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా, నా పిల్లల చదువు కోసం స్కాలర్‌షిప్ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన ప్రతిపాదనను నేను సున్నితంగా తిరస్కరించా’ అంటూ సింగ్ మరణవార్త తెలిసి Xలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
Similar News
News January 15, 2025
అందుకే కేజ్రీవాల్‌కు మద్దతు: అఖిలేశ్ యాదవ్
ఢిల్లీలో BJPని ఓడించే సత్తా ఆప్‌కు మాత్రమే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. BJPకి వ్యతిరేకంగా పోరాడే ప్రాంతీయ పార్టీలకు INDIA కూటమి నేతలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఏర్పడినప్పుడే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట వాటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కూటమి పార్టీలు SP, TMC, NCP(SP)లు ఆప్‌కు మద్దతు ప్రకటించాయి.
News January 15, 2025
సంక్రాంతి సెలవులు రేపే లాస్ట్
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు రేపటితో ముగియనున్నాయి. వీటికి ఈనెల 11 నుంచి 16 వరకు ఇంటర్ బోర్డు హాలిడేస్ ఇచ్చింది. పండగ సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు ఎల్లుండి నుంచి కాలేజీ బాట పట్టనున్నారు. ఇక రాష్ట్రంలోని స్కూళ్లకు 17 వరకు సెలవులు ఉన్నాయి. 18న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అటు ఏపీలోని స్కూళ్లకు 19 వరకు హాలిడేస్.
News January 15, 2025
మీరు గేమ్ నుంచి తీసేయొచ్చు.. కానీ నా వర్క్‌ను ఆపలేరు: పృథ్వీ షా
జాతీయ జట్టుతోపాటు దేశవాళీ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించారు. ‘మీరు నన్ను గేమ్ నుంచి తీసేయొచ్చు. కానీ నా వర్క్‌ను మాత్రం ఆపలేరు’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు అతను కొన్ని వారాలుగా మైదానం, జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా పృథ్వీని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే.