News March 26, 2025
అర్జున్ టెండూల్కర్‌ను బెస్ట్ బ్యాటర్‌గా మారుస్తా: యువరాజ్ తండ్రి

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను తాను 6 నెలల్లో వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా తయారు చేస్తానని యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ అన్నారు. ‘అర్జున్ బౌలింగ్‌పై టైమ్ వేస్ట్ చేసుకుంటున్నాడు. అతడిలో బౌలింగ్ కంటే బ్యాటింగ్ సామర్థ్యమే ఎక్కువ. నా దగ్గర ట్రైనింగ్‌కి వస్తే బెస్ట్ బ్యాటర్‌గా తీర్చిదిద్దుతా. నా దగ్గర 12days శిక్షణ తీసుకుని రంజీ అరంగేట్రంలో అతడు సెంచరీ చేశాడు. ఎవరైనా గ్రహించారా?’ అని గుర్తుచేశారు.
Similar News
News March 28, 2025
చాట్ జీపీటీని దాటేసిన గ్రోక్

ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ సంచలనం సృష్టిస్తోంది. అమెరికా గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ టాప్ ఫ్రీ లిస్టులో అగ్రస్థానానికి చేరింది. ఈ క్రమంలో గ్రోక్.. చాట్ జీపీటీ, టిక్‌టాక్‌ను దాటేసినట్లు మస్క్ ట్వీట్ చేశారు. గ్రోక్ ఆండ్రాయిడ్ యాప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చింది.
News March 28, 2025
RCBతో మ్యాచ్.. CSK 26/3

RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో CSKకు బిగ్ షాక్ తగిలింది. 4.4 ఓవర్లలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి 5, కెప్టెన్ రుతురాజ్ 0, దీపక్ హుడా 4 పరుగులకే ఔటయ్యారు. జోస్ హేజిల్‌వుడ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చేశారు. భువనేశ్వర్ ఒక వికెట్ తీశారు. క్రీజులో రచిన్ 16, కర్రన్ 0 ఉన్నారు.
News March 28, 2025
కేకేఆర్vsలక్నో మ్యాచ్ రీషెడ్యూల్

ఏప్రిల్ 6న (ఆదివారం) కేకేఆర్-లక్నో మధ్య జరగాల్సిన మ్యాచును రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. పండుగల కారణంగా తగినంత భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారని.. దీంతో ఆ మ్యాచును ఏప్రిల్ 8న నిర్వహిస్తామని పేర్కొంది. ఇక ఏప్రిల్ 6న గుజరాత్-SRH మ్యాచ్ ఒకటే ఉంటుందని తెలిపింది.