News March 26, 2025

అర్జున్ టెండూల్కర్‌ను బెస్ట్ బ్యాటర్‌గా మారుస్తా: యువరాజ్ తండ్రి

image

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను తాను 6 నెలల్లో వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా తయారు చేస్తానని యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. ‘అర్జున్ బౌలింగ్‌పై టైమ్ వేస్ట్ చేసుకుంటున్నాడు. అతడిలో బౌలింగ్ కంటే బ్యాటింగ్ సామర్థ్యమే ఎక్కువ. నా దగ్గర ట్రైనింగ్‌కి వస్తే బెస్ట్ బ్యాటర్‌గా తీర్చిదిద్దుతా. నా దగ్గర 12days శిక్షణ తీసుకుని రంజీ అరంగేట్రంలో అతడు సెంచరీ చేశాడు. ఎవరైనా గ్రహించారా?’ అని గుర్తుచేశారు.

Similar News

News April 25, 2025

అల్లు అర్జున్ సినిమాలో మృణాల్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ మూవీకి నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.

News April 25, 2025

పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. షా ఆదేశాలు

image

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేేపట్టారు.

News April 25, 2025

ఆర్మీ కంటపడ్డాడు.. ఖతమయ్యాడు

image

లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భారత సైన్యం <<16209767>>మట్టుబెట్టిన<<>> విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి నిందితుల కోసం ఆర్మీ, J&K పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టగా అల్తాఫ్ వారి కంటపడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీ ఫైరింగ్‌లో అల్తాఫ్ హతమయ్యాడు. అటు కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఆర్మీ చీఫ్ ద్వివేది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

error: Content is protected !!