News April 24, 2024
మల్కాజ్‌గిరిని నేనెప్పుడూ మర్చిపోను: రేవంత్
TG: మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని తానెప్పుడూ మర్చిపోనని CM రేవంత్ తెలిపారు. శామీర్‌పేట సభలో మాట్లాడిన ఆయన.. ‘కొడంగల్‌లో ఓడితే.. మల్కాజ్‌గిరిలో MPగా గెలిపించారు. MPగా చేసిన పోరాటంతోనే PCC చీఫ్ పదవి వచ్చింది. పడిపోతున్న నన్ను ఇక్కడి ప్రజలే నిలబెట్టారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చి.. నాకు అండగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సునీతా మహేందర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలి’ అని కోరారు.
Similar News
News January 23, 2025
పవన్‌తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హైకమిషనర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీ దిగి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు. సింగపూర్- ఆంధ్రప్రదేశ్ చిరకాల స్నేహాన్ని కలిగి ఉన్నాయి. AP-SG సహకారాన్ని బలోపేతం చేయడంపై జరిగిన చర్చను అభినందించాల్సిందే’ అని ట్వీట్ చేశారు.
News January 23, 2025
టీడీపీలో CBN తర్వాత స్థానం లోకేశ్‌దే: అచ్చెన్నాయుడు
AP: ఎవ్వరు ఏమనుకున్నా టీడీపీలో చంద్రబాబు తర్వాతి స్థానం లోకేశ్‌దేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు. కూటమికి 164 సీట్లు రావడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే అంశం ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదని చెప్పారు. పదవులైనా, నిర్ణయాలైనా కూటమి ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు.
News January 23, 2025
శ్రీలంకపై భారత్ విజయం
అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష(49) రాణించడంతో 118 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేసింది. భారత బౌలర్లలో షబ్నాం, జోషిత, పరుణిక చెరో రెండు, ఆయూషి, వైష్ణవి తలో వికెట్ తీశారు.