News January 20, 2025

ఇక బిగ్ బాస్ హోస్ట్ చేయను: హీరో ప్రకటన

image

కన్నడ బిగ్ బాస్ షోకు 11 ఏళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిచ్చా సుదీప్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. హోస్ట్‌గా తన జర్నీని ఎంజాయ్ చేశానని చెప్పారు. ‘నా శ్రమకు తగ్గ గుర్తింపు రాలేదు అన్పించింది. ఇతర భాషల్లో వచ్చినట్లుగా కన్నడ బిగ్ బాస్‌కు క్రేజ్ రాలేదు. అందుకే ఇక సినిమాలకే టైమ్‌ను కేటాయించాలనుకుంటున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Similar News

News November 20, 2025

కొత్త సినిమాల కబుర్లు

image

* పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుందని నిర్మాత రవి శంకర్ వెల్లడి.
* బాక్సాఫీస్ రారాజు వస్తున్నాడంటూ రాజాసాబ్ టీమ్ ట్వీట్. డిసెంబర్ 4న నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ప్రకటన.
* తమిళ హీరో సూర్యకు టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథ చెప్పినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని చర్చ.

News November 20, 2025

కుక్క కాటు వల్ల చనిపోతే రూ.5 లక్షల పరిహారం

image

కుక్క కాటు వల్ల ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.5 వేలు ఇస్తామని, ఇందులో రూ.3,500 బాధితులకు, రూ.1,500 ట్రీట్మెంట్ కోసం అందజేస్తామని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య కర్ణాటక స్కీమ్ కింద పాము కాటు బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది.

News November 20, 2025

26న దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు

image

రైతులు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM) వెల్లడించింది. రైతుల ఢిల్లీ మార్చ్‌కు ఐదేళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ‘నాడు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. MSP, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి వాటిని పట్టించుకోలేదు’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దవాలే మండిపడ్డారు.