News January 20, 2025
ఇక బిగ్ బాస్ హోస్ట్ చేయను: హీరో ప్రకటన

కన్నడ బిగ్ బాస్ షోకు 11 ఏళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిచ్చా సుదీప్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. హోస్ట్‌గా తన జర్నీని ఎంజాయ్ చేశానని చెప్పారు. ‘నా శ్రమకు తగ్గ గుర్తింపు రాలేదు అన్పించింది. ఇతర భాషల్లో వచ్చినట్లుగా కన్నడ బిగ్ బాస్‌కు క్రేజ్ రాలేదు. అందుకే ఇక సినిమాలకే టైమ్‌ను కేటాయించాలనుకుంటున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Similar News
News April 11, 2026
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ <
News April 11, 2026
మనిషి ప్రాణం, ఆకలి గురించి ఎంత గొప్పగా చెప్పారో!

పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఆభరణాలు ఎన్ని రకాలున్నా వాటిని తయారు చేసే బంగారం ఒక్కటే. మనుషుల రూపాలు, శరీరాలు వేర్వేరుగా ఉన్నా వాటిలో ఉండే ప్రాణం ఒక్కటే. అలాగే ఆహారాలు ఎన్నో ఉన్నా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే.
<<-se>>#PADHYAM<<>>
News April 11, 2026
సంక్రాంతికి బాలయ్య-విజయ్ కనకమేడల సినిమా?

‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ మూవీ చేస్తున్నారు. ఆ మూవీయే సంక్రాంతి బరిలో ఉంటుందని తొలుత అనుకున్నప్పటికీ ఇప్పుడు ప్లాన్‌లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.


