News March 28, 2024
హిందూపురం నుంచి కదలను: పరిపూర్ణానంద

AP: హిందూపురం నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు పరిపూర్ణానంద స్వామిజీ. టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. స్వామీజీ అయిన తనకు టికెట్ ఇస్తే ముస్లింల ఓట్లు పోతాయని చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పారని తెలిపారు. ముస్లింల ఓట్ల కోసం జనాభాలో ఎక్కువ శాతం ఉన్న హిందువుల ఓట్లు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
Similar News
News November 27, 2025
సారంగాపూర్: ‘ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి’

సారంగాపూర్ మండలం కోనాపూర్, అర్పపల్లి, ధర్మానాయక్ తండా, రంగపేట, నాగునూర్, లచ్చక్కపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు వేగంగా చేయాలని ఆదేశించారు. 17% తేమ ఉన్నా సన్న, దొడ్డు రకాలు తప్పనిసరిగా కొనాలన్నారు.
News November 27, 2025
పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.
News November 27, 2025
వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

‘జెమిని 3’ మోడల్ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్‌ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


