News November 27, 2024

ఎన్ని కేసులు పెట్టినా పారిపోను: చెవిరెడ్డి

image

AP: తనపై కుట్రతోనే <<14711254>>పోక్సో<<>>, ఎస్సీ, ఎస్టీ కేసుల పెట్టారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. బెదిరించి, కేసులు పెట్టి పరిపాలన చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడికి పారిపోనని, అందుబాటులోనే ఉంటానని చెప్పారు. తాను తప్పు చేసే వ్యక్తిని కాదని, అరెస్ట్ చేసుకోమని సవాల్ విసిరారు.

Similar News

News March 5, 2026

తేరుకున్న మార్కెట్లు.. లాభాల్లో ప్రారంభం

image

ఇరాన్ వార్ వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత 3 సెషన్లలో భారీ నష్టాలు చవిచూడగా ఇవాళ ఇన్వెస్టర్లు అనూహ్యంగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో కోల్ ఇండియా, రిలయన్స్, అదానీ పోర్ట్స్, ONGC, NTPC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

News March 5, 2026

దేశ భవిష్యత్తుకు ‘బరువు’ భయం!

image

<<19300696>>బాలల ఒబెసిటీ<<>> దేశ భవిష్యత్తును కలవరపెడుతోంది. ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు మున్ముందు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. పిల్లలు బరువు పెరగడం కంటిన్యూ అయితే దీర్ఘకాలిక వ్యాధులొచ్చి హెల్త్‌కేర్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా భవిష్యత్ వర్క్‌ఫోర్స్ బలహీనపడుతుంది. అందుకే బడుల్లో వ్యాయామం తప్పనిసరి చేయాలి. స్కూళ్లు, ప్రభుత్వం కలిసి ఊబకాయంపై చైతన్యం తేవాలి. ఇంట్లో సమతుల ఆహారం అందేలా తల్లిదండ్రులు చూడాలి.

News March 5, 2026

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 48 పోస్టులు

image

<>స్పోర్ట్స్<<>> అథారిటీ ఆఫ్ ఇండియా 48 పర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ/PG (ఫిజియోథెరపీ, మెడికల్ ఫిజియాలజీ/హ్యూమన్ ఫిజియాలజీ/స్పోర్ట్స్& ఎక్సర్‌సైజ్ ఫిజియాలజీ, ఆంత్రోపాలజీ, సైకాలజీ, స్పోర్ట్స్ సైన్స్, న్యూట్రీషన్& డైటిటిక్స్, బయోమెకానిక్స్) అర్హతగల వారు మార్చి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. నెలకు రూ.35,400-రూ.1,12,400 చెల్లిస్తారు.