News November 27, 2024

ఎన్ని కేసులు పెట్టినా పారిపోను: చెవిరెడ్డి

image

AP: తనపై కుట్రతోనే <<14711254>>పోక్సో<<>>, ఎస్సీ, ఎస్టీ కేసుల పెట్టారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. బెదిరించి, కేసులు పెట్టి పరిపాలన చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడికి పారిపోనని, అందుబాటులోనే ఉంటానని చెప్పారు. తాను తప్పు చేసే వ్యక్తిని కాదని, అరెస్ట్ చేసుకోమని సవాల్ విసిరారు.

Similar News

News December 3, 2024

ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ‘బ్రెయిన్ రాట్’

image

‘బ్రెయిన్ రాట్’ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించింది. బ్రెయిన్ రాట్ అంటే మానసిక స్థితి క్షీణించడం, గతి తప్పడం. సోషల్ మీడియాలో అవసరం లేని కంటెంట్‌ను ఎక్కువ చూడటానికి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ ప్రయోజనం లేకుండానే ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ కాలం గడిపేసేవారికీ ఈ పదం వర్తిస్తుంది. ఈ ఏడాదిలో ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

News December 3, 2024

వలస కార్మికులకు అండగా ఉంటాం: రామ్మోహన్ నాయుడు

image

AP: విదేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బాధితులకు ఇండియాకు రప్పించేందుకు విదేశాంగశాఖ సహాయం కోరతామని చెప్పారు. వారికి అవసరమైన ఫుడ్, ఇతర ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, వజ్రపుకొత్తూరు, కంచిలి, నందిగాంకు చెందిన దాదాపు 30 మంది వలస కార్మికులు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

News December 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.