News July 27, 2024

నన్ను కాల్చిన చోటే ర్యాలీ చేస్తా: ట్రంప్

image

పెన్సిల్వేనియాలో తనపై కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మళ్లీ ర్యాలీ నిర్వహించనున్నట్లు అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాల్పుల కారణంగా కన్నుమూసిన ఫైర్‌ఫైటర్ కోరీ గౌరవార్థం ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ బరిలో ఉండగా, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ పోటీ చేస్తున్నారు.

Similar News

News October 7, 2024

గ్రూప్-4 అభ్యర్థులకు GOOD NEWS!

image

TG: గ్రూప్-4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ కొంతమంది అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. తుమ్మల TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి కాల్ చేసి.. తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. కాగా, 2023లో గ్రూప్-4 పరీక్షలు నిర్వహించగా, 45 రోజుల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. కానీ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.

News October 7, 2024

రోహిత్ 2027 ప్రపంచకప్ ఆడతాడు: చిన్ననాటి కోచ్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కచ్చితంగా 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడని అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ అన్నారు. WTC ఫైనల్ తర్వాత టెస్టుల నుంచి తప్పుకుని వన్డేల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఫిట్‌నెస్ సమస్యలు కూడా లేవని తెలిపారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమికి రోహిత్ ఔటవడమే ప్రధాన కారణమని లాడ్ అభిప్రాయపడ్డారు.

News October 7, 2024

VIRAL: హైదరాబాద్ గొప్పతనం ఇదే!

image

పొట్టకూటి కోసం తరలివచ్చిన ఎంతో మందికి హైదరాబాద్ అండగా నిలిచిందని తెలిపే ఓ ఫొటో వైరలవుతోంది. ‘బతకడమే వేస్ట్ అనుకున్న నాకు.. హైదరాబాద్ ఎలా బతకాలో నేర్పింది’ అని ఓ వ్యక్తి తన ఆటో వెనుక రాసుకున్నారు. దీనిని ఓ వ్యక్తి ఫొటో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఉపాధి కోసం వస్తే అమ్మలా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని నెటిజన్లు కితాబిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు HYDలో ఉపాధి పొందుతున్నారు.