News March 9, 2025
పద్మశాలీల రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్

TG: రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించిన కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నానని, పద్మశాలీల రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లను నేతన్నలకే ఇస్తున్నట్లు HYDలో అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ప్రకటించారు.
Similar News
News March 19, 2025
టెన్త్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

TG: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్‌తో పాటు సీరియల్ నంబర్‌ను ముద్రిస్తున్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ఇవ్వనున్నారు. అదనపు షీట్లు ఇవ్వరు. ఉ.9.30 గం.కు పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. హాల్ టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
News March 19, 2025
అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంటుందంటే?

భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి. నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.
News March 19, 2025
రాత్రికి రాత్రే YSR పేరు తొలగించారు: వైసీపీ

AP: విశాఖపట్నంలో కూటమి నాయకుల ఉన్మాదం పతాక స్థాయికి చేరిందని వైసీపీ ఆరోపించింది. ‘వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న YSR పేరును టీడీపీ నేతలు తొలగించారు. రాత్రికి రాత్రే డా.వైఎస్సార్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్చారు. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు’ అని Xలో ఫొటోలు పోస్ట్ చేసింది.