News March 28, 2024
నేను బీఆర్ఎస్‌లోనే ఉంటా: కేకే కుమారుడు

TG: సీనియర్ నేత కె.కేశవరావు బీఆర్ఎస్‌ను వీడనుండటంపై ఆయన కుమారుడు విప్లవ్ స్పందించారు. ‘కేకే, విజయలక్ష్మి నిర్ణయంతో నాకు సంబంధం లేదు. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్‌లోనే ఉంటా. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంది’ అని ప్రకటించారు. కాగా కేకే పార్టీ మార్పుపై మాజీ సీఎం కేసీఆర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 18, 2026
25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<
News February 18, 2026
భారీగా పెరిగిన అరటి ధరలు.. గెల ఎంతంటే?

AP: అరటి ధరలకు రెక్కలొచ్చాయి. JAN వరకు కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి గెల ₹200-300 ఉండేది. ఇప్పుడు ₹700-1000కి పెరిగింది. ఏప్రిల్ వరకు ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. గత 3ఏళ్లుగా తక్కువ ధరలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు రావడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. డిమాండ్‌కు తగ్గట్లు అరటి మార్కెట్లోకి రావట్లేదు.
News February 18, 2026
నేరేడు పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నేరేడు చెట్లకు ఫిబ్రవరి ఆఖరు నుంచి లేదా మార్చి తొలి వారంలో నీటి వసతిని ఏర్పాటు చేసుకుంటే పూత రాలకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చిన పూత రాలుతున్నట్లు గమనిస్తే 15 లీటర్ల నీటిలో ప్లానోఫిక్స్ అనే మందు 3 గ్రాములను కలుపుకొని ఒకసారి పిచికారీ చేయాలి. దీని వల్ల పూత రాలడం తగ్గి, పిందె కట్టడానికి, పిందె శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాయ నాణ్యత పెంచడానికి కూడా ఈ మందు కొంత సాయం చేస్తుంది.


