News September 20, 2024
ఆ కేంద్రమంత్రి తల తెచ్చిన వారికి నా ఆస్తి రాసిస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే

TG: రాహుల్ గాంధీ నంబర్ వన్ ఉగ్రవాది అంటూ కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు చేసిన ఆరోపణలపై ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. బిట్టు తల నరికి తెచ్చినవారికి తన ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని రాసిస్తానని ప్రకటించారు. బిట్టుపై బీజేపీ కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు బిట్టుపై కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో బెంగళూరులో కేసు నమోదైంది.
Similar News
News December 7, 2025
గాలివీడు: 42 ఏళ్ల తర్వాత కలిశారు.!

గాలివీడు మండల జడ్పీ హైస్కూల్ 1982–83 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం SK కళ్యాణ మండపంలో నిర్వహించారు. పాత మిత్రులు ఒకచోట చేరి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి కలయిక ఎంతో ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. దాదాపు 42 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో పాఠశాల జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
News December 7, 2025
ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్

భారీగా విమాన సర్వీసుల రద్దు, వాయిదాలతో ప్రయాణికుల ఖాతాల్లోకి ఇండిగో డబ్బులు రీఫండ్ చేస్తోంది. ఇప్పటివరకు రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు 95శాతం సర్వీసులను రీస్టోర్ చేసినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. డిసెంబర్ 10-15 మధ్యలో సేవలు సాధారణ స్థితికి చేరుతాయని పేర్కొంది.
News December 7, 2025
రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్లైన్లో రాంగ్ కస్టమర్ నంబర్కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.


