News March 28, 2024

ఒక్కరితో అలా చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను: కొడాలి

image

అర్హత ఉండి తమకు ఇంటి స్థలం రాలేదని ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘టీడీపీ హయాంలో గుడివాడలో సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. మా పాలనలో అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం. చంద్రబాబు పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. సీఎం జగన్ పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

రాష్ట్రంలో 4 వేల ఖాళీలు!

image

TG: ఎస్సీ గురుకుల సొసైటీలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా TGSWREISకు 9,735 మంది పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 5,763 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పలు శాఖల్లో అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో కలిపి 4,725 ఖాళీలు ఉన్నాయని, వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖను కోరితే 4వేలకు అనుమతిచ్చిందని సమాచారం.

News December 4, 2025

PCOS వస్తే జీవితాంతం తగ్గదా?

image

పీసీఓఎస్‌ అనేది దీర్ఘకాలిక సమస్యే. కానీ ఆరోగ్యకర జీవనశైలి పాటిస్తే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బరువు అదుపులో ఉండాలి. వ్యాయామం చేయడం మీ జీవనశైలిలో ఒక భాగం కావాలి. హార్మోన్ల అసమతుల్యతను, మెటబాలిక్‌ సమస్యల్ని సరిచేయడానికి వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. అలాగే గర్భం నిలవకపోతే అండం విడుదల కోసం కూడా మంచి మందులున్నాయి. కాబట్టి భయపడక్కర్లేదని సూచిస్తున్నారు.

News December 4, 2025

ఈ అలవాట్లతో సంతోషం, ఆరోగ్యం!

image

చిన్న చిన్న అలవాట్లే మంచి ఆరోగ్యం, సంతోషానికి కారణమవుతాయని న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ చెబుతున్నారు. ఉదయాన్నే సూర్యకాంతిలో ఉండటం, రోజువారీ నడక, మంచి నిద్ర, శ్రద్ధతో తినడం, మిమ్మల్ని కేర్ చేసే వారితో మాట్లాడటం, 2 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్, దయతో వ్యవహరించాలని తెలిపారు. రాత్రి వేళల్లో స్క్రీన్ చూడటం తగ్గించడం, హైడ్రేటేడ్‌గా ఉండటం, రోజూ కొత్తవి నేర్చుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.