News March 28, 2024
ఒక్కరితో అలా చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను: కొడాలి

అర్హత ఉండి తమకు ఇంటి స్థలం రాలేదని ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘టీడీపీ హయాంలో గుడివాడలో సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. మా పాలనలో అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం. చంద్రబాబు పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. సీఎం జగన్ పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 11, 2026
ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆహారపదార్థాలను ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో బిస్పినాల్ ఏ (BPA) రసాయనం ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS, టైప్2 డయాబెటిస్, నాడీ వ్యవస్థ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News March 11, 2026
మినిమం డిపాజిట్ చేయకపోతే అకౌంట్లు ఇనాక్టివ్!

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనుంది. మీ PPF, SSY (సుకన్య సమృద్ధి), NPS ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఆలోపు కనీస డిపాజిట్లు (PPF-₹500, SSY-₹250, NPS-₹1,000) చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ చేయలేకపోతే ఆ ఖాతాలు ‘ఇనాక్టివ్’ స్టేటస్‌లోకి వెళ్తాయి. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మిస్ అవుతారు.
News March 11, 2026
వివేకా హత్య కేసు.. సునీత పిటిషన్ల కొట్టివేత

AP: దివంగత ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతా రెడ్డికి చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణ త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును SC ఆదేశించింది.


