News January 28, 2025
కడియం అంతుచూసేవరకూ నిద్రపోను: తాటికొండ రాజయ్య

TG: MLA కడియం శ్రీహరిపై BRS మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కడియం అంతు చూసేవరకూ నేను నిద్రపోను. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధీ లేదు. అవకాశవాదైన కడియం పప్పులు కాంగ్రెస్లో ఉడకవు. ఆ పార్టీ మంత్రులు సొంత దుకాణాలు తెరుచుకున్నారు. భట్టి విక్రమార్క భార్య సహా ఆ పార్టీ క్యాబినెట్ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయం’ అని ఆరోపించారు.
Similar News
News December 2, 2025
ఆ ఎస్జీటీలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ

AP: బీఈడీ క్వాలిఫికేషన్తో ఎస్జీటీలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2018-23 మధ్య కాలంలో నియమితులైన వారు ఈ నెల 25 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
News December 2, 2025
పెట్టుబడుల వరద.. 6 నెలల్లో ₹3 లక్షల కోట్లు!

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల్లో రూ.3.15 లక్షల కోట్లు($35.18B) వచ్చాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అమెరికా నుంచి వచ్చిన FDIలు రెట్టింపు కావడం గమనార్హం. ఇక FDIలను ఆకర్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ($10.57B), కర్ణాటక ($9.4B) టాప్లో ఉన్నాయి. తెలంగాణకు $1.14B పెట్టుబడులు వచ్చాయి.
News December 2, 2025
జపం చేసేటప్పుడు మధ్య వేలును ఎందుకు ఉపయోగిస్తారు?

యోగ శాస్త్రం ప్రకారం.. మధ్య వేలు నుంచి ఓ ముఖ్యమైన ప్రాణశక్తి ప్రవహిస్తుంది. జపం చేసేటప్పుడు ఈ వేలిని ఉపయోగించడం వలన మనస్సు శుద్ధి జరిగి, నాడీ వ్యవస్థ బలపడుతుంది. దీనికి మంత్ర శక్తి తోడై కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. దీని ప్రభావం మనసు చంచల స్వభావాన్ని నియంత్రిస్తుంది. అలాగే మనిషిని అంతరాత్మతో అనుసంధానం చేస్తుంది. ఫలితంగా, ఆధ్యాత్మిక బంధం బలపడుతుంది. భగవంతుని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి.


