News January 28, 2025
కడియం అంతుచూసేవరకూ నిద్రపోను: తాటికొండ రాజయ్య

TG: MLA కడియం శ్రీహరిపై BRS మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కడియం అంతు చూసేవరకూ నేను నిద్రపోను. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధీ లేదు. అవకాశవాదైన కడియం పప్పులు కాంగ్రెస్‌లో ఉడకవు. ఆ పార్టీ మంత్రులు సొంత దుకాణాలు తెరుచుకున్నారు. భట్టి విక్రమార్క భార్య సహా ఆ పార్టీ క్యాబినెట్ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయం’ అని ఆరోపించారు.
Similar News
News February 10, 2025
రంగరాజన్‌ను పరామర్శించిన కొండా సురేఖ

TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడి గురించి ఆమె ఆరా తీశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా పూజారిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News February 10, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ: ఆనం

AP: ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందిలేకుండా తాగునీరు, ఆహారం అందిస్తామని చెప్పారు. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికీ ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్‌ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.
News February 10, 2025
చైనా సంక్షోభం: పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరుగుతున్నాయ్

చైనాలో పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరగడం ఆందోళనకరంగా మారింది. 2024లో 61L వివాహాలు నమోదయ్యాయి. 1986 తర్వాత ఇదే అత్యల్పం. 2023తో పోలిస్తే 20.5% తగ్గడం గమనార్హం. ఇక గత ఏడాది 26L జంటలు డివోర్స్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 28K అధికం. అలాగే ఆ దేశంలో శ్రామిక జనాభా(16-59yrs) 68L తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకు పైగా వయసున్న వారు 22 శాతానికి పెరిగారని తేలింది.