News May 24, 2024
IAS కన్ఫర్మెంట్ వాయిదా వేయాలి.. UPSCకి చంద్రబాబు లేఖ

AP: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఐఏఎస్‌ల కన్ఫర్మెంట్ ప్రక్రియ సముచితం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మెంట్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి ఆయన లేఖ రాశారు. CMOలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. ఈ జాబితా తయారీలో పారదర్శకత లేదన్నారు.
Similar News
News October 30, 2025
ఇదేందయ్యా ఇదీ.. బంగారు నగలు ధరిస్తే రూ.50వేలు ఫైన్

మన దేశంలో బంగారు ఆభరణాలు ధరించడమంటే ఇష్టపడని వారుండరు. కానీ ఉత్తరాఖండ్‌లోని జౌన్సర్-బావర్ ప్రాంతంలో ఉన్న కంధర్ గ్రామ నివాసితులు వింత నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా అసమానతలు తగ్గించేందుకు ఒంటినిండా నగలు ధరిస్తే రూ.50వేలు జరిమానా విధించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. మహిళలు సైతం దీనికి అంగీకారం తెలిపారు. శుభకార్యాల్లో చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలనే నిబంధన విధించారు.
News October 30, 2025
IPL: ముంబైని రోహిత్ వీడతారా? క్లారిటీ

రాబోయే IPL సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్(MI)ను వీడతారనే ఊహాగానాలకు బ్రేక్ పడింది. హిట్‌మ్యాన్ MIని వీడతారనే ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఆ ఫ్రాంచైజీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘సూర్యుడు తిరిగి ఉదయిస్తాడు’ అనే క్యాప్షన్‌తో రోహిత్ ఫొటోను షేర్ చేసింది. ఈ ట్వీట్‌తో ముంబై జట్టులో రోహిత్ కొనసాగింపుపై క్లారిటీ వచ్చినట్లైంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News October 30, 2025
JIO యూజర్లకు ₹35,100 విలువైన గూగుల్ AI సేవలు ఫ్రీ!

JIO & GOOGLE భాగస్వామ్యంతో జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా (₹35,100 విలువైన) గూగుల్ AI Pro సేవలు లభించనున్నాయి. ఈ ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. ఈ సేవలను తొలుత 18-25 ఏళ్ల Jio 5G యూజర్లకు అందించి.. ఆ తర్వాత అందరికీ విస్తరించనున్నారు. ‘AI సేవలను ప్రతి భారతీయుడికి అందించడమే లక్ష్యం’ అని ఇరు సంస్థలు తెలిపాయి.


