News May 24, 2024
IAS కన్ఫర్మెంట్ వాయిదా వేయాలి.. UPSCకి చంద్రబాబు లేఖ

AP: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఐఏఎస్‌ల కన్ఫర్మెంట్ ప్రక్రియ సముచితం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మెంట్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి ఆయన లేఖ రాశారు. CMOలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. ఈ జాబితా తయారీలో పారదర్శకత లేదన్నారు.
Similar News
News February 18, 2025
బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్‌గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.
News February 18, 2025
మా వాళ్లు సెమీస్‌కు వెళ్తే గొప్పే: కమ్రాన్ అక్మల్

పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తన సొంత దేశంపై విమర్శలు గుప్పించారు. పాక్ జట్టు సెమీస్ వరకూ వెళ్తే గ్రేట్ అంటూ ఎద్దేవా చేశారు. ‘మా జట్టులో చాలా లోపాలున్నాయి. సరైన స్పిన్నర్లే లేరు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ సమస్యలే. సెలక్షనే సరిగ్గా లేదు. నా దృష్టిలో ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరతాయి. మా జట్టు సెమీస్‌కు చేరితే అది గొప్పే’ అని వ్యాఖ్యానించారు.
News February 18, 2025
సిక్కుల తలపాగాలు తీయించిన అమెరికా?

అక్రమ వలసదారుల్ని అమెరికా భారత్‌కు పంపించేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజా విమానంలో సిక్కుల తలపాగాలను తీయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 116మంది వలసదారులతో కూడిన విమానం నిన్న అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఎలాగూ వెనక్కి పంపిస్తున్న అమెరికా, ఇలాంటి పనులు చేయడమేంటంటూ వలసదారులు మండిపడుతున్నారు.