News November 27, 2024
ఐసీసీ ర్యాంకింగ్స్: తొలి స్థానంలో బుమ్రా
ICC ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌లో జైస్వాల్ రెండో స్థానంలో, పంత్ 6, విరాట్ కోహ్లీ 13వ స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా తొలి స్థానం, అశ్విన్ 4, జడేజా 7వ స్థానం పొందారు. ఆల్ రౌండర్లలో జడేజా తొలి స్థానం, అశ్విన్ 2, అక్షర్ పటేల్ ఏడో స్థానంలో నిలిచారు. ఇటీవల AUSతో తొలి టెస్టులో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు చేయగా, బుమ్రా 8 వికెట్లతో రాణించారు.
Similar News
News December 14, 2024
జీవో 317 సమస్యను పరిష్కరించండి: ఉపాధ్యాయులు
TG: జీవో 317 సమస్యను పరిష్కరించి తమను సొంత జిల్లాలకు పంపాలని బాధిత ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. స్థానికత ఆధారంగా తమను బదిలీ చేయాలని కోరారు. HYDలోని ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద పలువురు ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవోను రద్దు చేయాలని విన్నవించారు.
News December 14, 2024
ఎంగేజ్మెంట్ చేసుకున్న సింధు(PHOTO)
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ED వెంకట దత్తసాయితో రింగ్స్ మార్చుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అని ఓ కోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో పాటు కాబోయే భర్తతో కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. వీరి వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది.
News December 14, 2024
వైసీపీ నిరసనలు శుక్రవారం మాత్రమే: మంత్రి సత్యకుమార్
AP: వైసీపీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్విటర్లో సెటైర్లు వేశారు. ‘డిసెంబర్ 13న శుక్రవారం, డిసెంబర్ 27న శుక్రవారం, జనవరి 3న శుక్రవారం. తమ నిరసనలు, పోరుబాటల్లాంటి రాజకీయ కార్యకలాపాలకు ప్రతీ వారం కేవలం “శుక్రవారం” రోజునే వైసీపీ ఎన్నుకోవడం పూర్తిగా యాదృచ్ఛికమే. ఎటువంటి మతలబు లేదు. సాకులు చూపే ఉద్దేశం అసలే లేదు’ అని పేర్కొన్నారు. దానికి జైలు పక్షి అని హాష్‌ట్యాగ్ జతచేయడం గమనార్హం.