News November 13, 2024
ICC ర్యాంకింగ్స్.. నం.1 ప్లేస్‌లో పాక్ బౌలర్
ICC తాజాగా ప్రకటించిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ బౌలర్ షాహీన్‌షా అఫ్రీది నంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేశారు. మూడు వన్డేల్లో 8 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌కు ముందు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 4వ ప్లేస్‌లో ఉన్న అఫ్రీది ఏకంగా తొలి స్థానానికి దూసుకొచ్చారు. IND తరఫున కుల్దీప్(4), బుమ్రా(6), సిరాజ్(8) టాప్-10లో ఉన్నారు.
Similar News
News December 10, 2024
కాలుష్యాన్ని నియంత్రించే బ్యాక్టీరియా.. IIT గువాహటి శాస్త్రవేత్తల ఆవిష్కరణ
బ్యాక్టీరియా ద్వారా మీథేన్, కార్బన్ డయాక్సైడ్‌ను శుద్ధమైన బయోఫ్యూయల్‌గా మార్చే విధానాన్ని IIT గువాహటి శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. Prof.దేవాశిష్, కళ్యాణి సాహు బృందం ఆవిష్కరించిన ఈ విధానం ద్వారా మెథానోట్రోఫిక్ బ్యాక్టీరియా కాలుష్య కారకాలను శుద్ధిచేస్తుంది. ప్రయోగ దశలో ఉన్న ఈ నమూనా ప్రస్తుతం 5L పరిమాణంలో ఉంది. పర్యావరణ అనుకూల ఇంధన ఆవిష్కరణలో ఇది కీలక ముందడుగని వారు పేర్కొన్నారు.
News December 9, 2024
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ఎప్పటి నుంచంటే?
AP: రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు TDP MLA యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు.
News December 9, 2024
నేను చేసిన తప్పు మీరు చేయొద్దు: రకుల్ ప్రీత్
కొన్ని రోజుల క్రితం వర్కౌట్ చేస్తూ గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిమితికి మించి వర్కౌట్లు చేసి తప్పు చేశానని, ఆ తప్పు ఇంకెవ్వరూ చేయొద్దని కోరారు. గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ బ్యూటీ కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.