News November 14, 2024
IND, PAK హక్కుల్ని ICC రద్దు చేయాలి: పాక్ మాజీ కెప్టెన్

భారత్, పాకిస్థాన్ బోర్డులకు ఉన్న టోర్నీల హోస్టింగ్ హక్కుల్ని ఐసీసీ రద్దు చేయాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించారు. భేదాలు సెట్ అయ్యేవరకూ హోస్టింగ్ను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ‘2023-2031 మధ్యకాలంలో పాక్లో రెండు ఈవెంట్లు, INDలో 5 ఈవెంట్లు ఉన్నాయి. ఆ నిర్వహణ హక్కులన్నింటినీ ఐసీసీ వేరే దేశాలకు తరలించాలి. అప్పుడే సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.


