News July 3, 2024
ICC ట్రోఫీ: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మరోసారి దాయాదుల సమరం జరిగే అవకాశం ఉంది. 2025 మార్చి 1న లాహోర్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్‌పై ICC, PCB వేచి చూస్తున్నా BCCI ఇంకా తన నిర్ణయం వెల్లడించటం లేదని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-Aలో ఇండియా, పాక్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-Bలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గాన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 15, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.750 ఎగబాకి రూ.1,23,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,13,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 15, 2025
అంచనాలను అందుకోని రబీ సాగు

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.
News December 15, 2025
లెజెండరీ సింగర్ బయోపిక్‌లో సాయిపల్లవి

లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్‌లో హీరోయిన్ సాయిపల్లవిని తీసుకునే యోచనలో ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


