News June 2, 2024

ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా మహిళా వ్యాపారవేత్త

image

ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా టోమస్‌డోత్తిర్ ఎన్నికయ్యారు. ఆగస్టు 1న ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని స్థానిక మీడియా పేర్కొంది. మాజీ ప్రధాని కత్రిన్ జాకోబ్స్‌డోత్తిర్‌పై ఆమె విజయం సాధించారు. 55 ఏళ్ల హల్లాకు 34.3 శాతం ఓట్లు రాగా, కత్రిన్‌కు 25.5 శాతం వచ్చాయి. కాగా హల్లా B టీమ్ కంపెనీ సీఈవోగా ఉన్నారు.

Similar News

News September 19, 2024

లంచ్ సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?

image

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌ను యశస్వి, పంత్ ఆదుకున్నారు. లంచ్ విరామం వరకు వికెట్ కోల్పోకుండా నియంత్రణతో ఆడారు. భారత జట్టు 23 ఓవర్లలో 88 పరుగులు చేయగా యశస్వి(37), పంత్(33) క్రీజులో ఉన్నారు.

News September 19, 2024

గూఢచార సంస్థ మొస్సాద్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

హెజ్బొల్లా పేజ‌ర్లు, వాకీటాకీలు పేలిన ఘటనలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కి ఘ‌న చ‌రిత్రే ఉంది. 1976లో ఉగాండాలో 102 మంది బందీల విడుద‌లకు ఆప‌రేష‌న్ ఎంటెబ్బా చేపట్టింది. త‌మ అథ్లెట్ల‌ను హ‌త్య చేసిన వారిని వివిధ దేశాల్లో వెంటాడి చంపింది. ఐచ్మాన్, ఒపేరా, మొసెస్‌, డైమండ్‌, ప్లంబ‌ట్‌, స‌బేనా వంటి అనేక ఆపరేషన్లు చేపట్టింది. శత్రు దుర్భేద్యమైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మొస్సాద్ బలం.

News September 19, 2024

జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఉదయభాను

image

AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. రేపు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఉదయభాను మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్‌గా పని చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం ఈ నెల 22న జనసేనలో చేరే అవకాశం ఉంది.