News January 6, 2025
ICMR OFFICIAL: ఆ ఇద్దరిదీ చైనా వైరస్సే

భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్‌లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్స్‌ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం.
Similar News
News February 25, 2026
చైనా అండతో USను టార్గెట్ చేసిన ఇరాన్!

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు ఆ దేశ తీరానికి సమీపంలో మోహరించాయి. దీనికి కౌంటర్‌గా ఇరాన్.. చైనా నుంచి సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను కొనుగోలు చేయనుంది. ఇప్పటికే డీల్ దాదాపు పూర్తి కావొచ్చిందని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. వీటితో 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను అటాక్ చేయవచ్చు. వాటిని అడ్డుకోవడం చాలా కష్టం.
News February 25, 2026
HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదేళ్ల వయసు నాటి నుంచి 45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే దీన్ని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. 9 నుంచి 15 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.
News February 25, 2026
కీరదోసలో బూజు తెగులు – నివారణ

కీరదోసలో ఈ తెగులు ఆశిస్తే ఆకు అడుగు భాగంలో బూజు మాదిరిగా ఏర్పడుతుంది. తెగులు ఉద్ధృతి ఎక్కువైతే ఆకు అడుగున ఊదారంగు మచ్చలు, పైభాగాన పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు త్వరగా ఎండిపోయి రాలిపోతాయి. అధిక తేమ, పొగ మంచు ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్ 64% WP 3 గ్రాములను కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.


