News January 6, 2025

ICMR OFFICIAL: ఆ ఇద్దరిదీ చైనా వైరస్సే

image

భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్‌లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్స్‌ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం.

Similar News

News January 18, 2025

పవన్ కళ్యాణ్ అభిమానులకు మళ్లీ నిరాశే?

image

హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాబిన్ హుడ్’ మార్చి 28న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సైతం అదేరోజున విడుదలకానుంది. నితిన్ మూవీ అప్డేట్‌తో HHVM వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రాబిన్‌ హుడ్‌తో పాటు VD12, మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే తేదీలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

News January 18, 2025

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసులో తీర్పు వెల్లడి

image

యావత్ దేశం చలించిన <<13905124>>అభయ<<>> హత్యాచార కేసులో సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్‌ను దోషిగా తేలుస్తూ తీర్పిచ్చింది. కలకత్తా RG కర్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ డాక్టర్ 2024 AUG 9న దారుణ అత్యాచారం, హత్యకు గురైంది. నిర్భయ తీవ్రతను తలపించేలా జరిగిన ఈ దుశ్చర్యపై CBI దర్యాప్తు జరిపి OCT 7న ఛార్జిషీట్ వేసింది. డైలీ విచారణ అనంతరం నేడు దోషిగా తేల్చిన జడ్జి అనిర్బన్ దాస్ సోమవారం శిక్ష ఖరారు చేయనున్నారు.

News January 18, 2025

మరోసారి జత కట్టనున్న ధనుష్‌-వెంకీ అట్లూరి!

image

‘లక్కీ భాస్కర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తన తదుపరి ప్రాజెక్టును తమిళ నటుడు ధనుష్‌తో తీయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రెండోసారి ధనుష్‌తో జత కట్టనున్నారని, దీనికి ‘హానెస్ట్ రాజా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘సార్’ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.