News August 10, 2024
TGలో అరుదైన మూలకాల నిల్వలు గుర్తింపు
TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోన్స్, కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్ వంటి పరికరాల్లో ఉపయోగించే అరుదైన మూలకాల నిల్వలు ఉన్నట్లు బయటపడింది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. 15 రకాల లాంథనైడ్స్‌తో పాటు స్కాండియం, ఏట్రియంను గుర్తించినట్లు GSI నివేదిక ఇచ్చింది. దీంతో రాష్ట్ర గనులశాఖ ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.
Similar News
News September 20, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.500 కోట్లు?
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందన్న ఆరోపణల వేళ కేంద్రం ఈ ఫ్యాక్టరీకి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ నిధులతో జీఎస్టీ, ఉద్యోగ భవిష్య నిధి, ప్రభుత్వ లెవీలు వంటి చట్టబద్ధమైన చెల్లింపులు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. చెల్లింపుల నిర్వహణను SBIకి అప్పగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర అంశాలకు వినియోగిస్తే వెంటనే నిలిపేయాలని సూచించినట్లు పేర్కొంటున్నాయి.
News September 20, 2024
ENGvsAUS: హెడ్ విధ్వంసం.. ఆసీస్ ఘన విజయం
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యాన్ని 44 ఓవర్లలోనే ఛేదించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొడుతున్న ట్రావిస్ హెడ్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. 129 బంతుల్లో అజేయంగా 154 రన్స్(20 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2011లో వాట్సన్ 161* రన్స్ చేశారు.
News September 20, 2024
ప్రభాస్ సినిమాలకు మరింత భారీ బడ్జెట్?
‘కల్కి 2898ఏడీ’తో ప్రభాస్ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో ఆయన తర్వాతి సినిమాల నిర్మాతలు బడ్జెట్‌లను మరింత పెంచేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కే స్పిరిట్ మూవీకి మొదట అనుకున్న రూ.300 కోట్ల అంచనా ఇప్పుడు రూ. 500 కోట్లకు చేరినట్లు టాలీవుడ్ టాక్. ఇక సలార్-2, రాజా సాబ్, హను-ప్రభాస్ సినిమాలకూ ఆయా చిత్రాల నిర్మాతలు భారీగా వెచ్చిస్తున్నారని సమాచారం.