News February 21, 2025
అమెరికన్ల హాని కోరితే.. భూమి మీద ఎక్కడున్నా వదలం: కాష్ పటేల్

FBI తొమ్మిదో డైరెక్టర్‌గా నియమితులైన కాష్ పటేల్ అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇది నాకు దక్కిన గౌరవం. మన న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం క్షీణించింది. కానీ, అది నేటితో ముగుస్తుంది. డైరెక్టర్‌గా నా లక్ష్యం స్పష్టంగా ఉంది. FBIపై ప్రజల్లో నమ్మకాన్ని తీసుకురావాలి. అమెరికన్లకు హాని కలిగించాలని కోరుకునే వారు ఈ భూమి మీద ఎక్కడున్నా మిమ్మల్ని వదిలిపెట్టము’ అని Xలో పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
నేడు జనగామ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కోనాయిచలం వద్ద రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రి, డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
News March 16, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 82,580 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News March 16, 2025
శ్రీచైతన్య స్కూల్‌లో ఘర్షణ.. భవనంపై నుంచి కింద పడ్డ బాలిక

తిరుపతిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఓ విద్యార్థిని రెండో ఫ్లోర్ నుంచి కింద పడిపోవడం కలకలం రేపింది. విద్యార్థినుల మధ్య గొడవ జరిగిన సమయంలో తోటి విద్యార్థిని ఆమెను పైనుంచి తోసేసిందని సమాచారం. కిందపడిన బాలికకు నడుం విరగడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. ఘటనపై తిరుపతి అర్బన్ తహశీల్దార్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.