News September 28, 2024
నిజమేనని తేలితే RGకర్ మాజీ ప్రిన్సిపల్‌కు మరణదండనే: CBI కోర్టు
RGకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌కు CBI కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని, నిజమేనని తేలితే మరణదండనకు దారితీస్తాయని తెలిపింది. నిందితుడిని బెయిల్‌పై రిలీజ్ చేయడం అన్యాయమే అవుతుందంది. టాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మండల్ బెయిల్‌నూ తిరస్కరించింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సాక్ష్యాల ట్యాంపరింగ్, FIR లేట్ కేసులో వీరు అరెస్టయ్యారు.
Similar News
News October 13, 2024
పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలివే..
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. OCT, NOV, DECలో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ 3 నెలల్లోని కొన్ని తేదీలను పండితులు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించారు. ఇప్పటికే NOV, DECలో ముహూర్తాలు పెట్టగా, ఈనెలలోనూ నిన్నటి నుంచి పెళ్లిళ్లు మొదలయ్యాయి. OCTలో 13,16,20,27, NOVలో 3,7,8,9,10,13,14,16,17, DECలో 5,6,7,8,11,12, 14,15, 26 తేదీలు వివాహాలకు అనుకూలమైనవని పండితులు వెల్లడించారు.
News October 13, 2024
విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై ఇరాన్ నిషేధం
ప్రతీకార దాడులు తప్పవన్న ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ జాగ్రత్తపడుతోంది. హెజ్బొల్లా పేజర్ల పేలుళ్ల తరహా ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా ఇరాన్ విమానయాన శాఖ వీటిపై నిషేధం విధించింది. ప్రయాణికులు మొబైల్ ఫోన్లు మినహా పేజర్లు, వాకీటాకీలను విమాన క్యాబిన్‌లో, చెక్-ఇన్‌లో తీసుకెళ్లలేరు. దుబాయ్ నుంచి వచ్చి, వెళ్లే విమానాల్లో సహా దుబాయ్ మీదుగా వెళ్లే విమానాల్లో ఈ నిషేధాన్ని విధించారు.
News October 13, 2024
ప్రభుత్వానిదే బాధ్యత.. సిద్దిఖీ హత్యపై రాహుల్
MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిఖీ కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఈ హత్య ఘటన MHలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని రాహుల్ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సిద్దిఖీ హత్య బాలీవుడ్ చిత్రసీమలోనూ తీవ్ర విషాదం మిగిల్చింది.